దుర్మార్గానికి పరాకాష్ట.. డబ్బులు గుంజేస్తున్న ఆంబులెన్స్ డ్రైవర్లు.. 40కి.మీలకు 17వేలా?

బుధవారం, 2 జూన్ 2021 (13:35 IST)
Ambulance
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో కరోనా రోగుల పట్ల అంబులెన్స్ డ్రైవర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. భారీగా డబ్బులు గుంజేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసింది. సంక్షోభం వేళ కాసుల వేట మొదలు పెట్టారు దుర్మార్గులు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని 40 కిలోమీటర్లు తరలించేందుకు రూ. 17 వేలు ఛార్జ్ చేశాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు బాధిత వ్యక్తి తనయుడు. ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుభోదీప్ సేన్ తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దాంతో అతను తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు కాల్ చేశాడు.
 
అసన్‌సోల్ నుంచి దుర్గాపూర్‌కు దాదాపు 40 కిలోమీటర్లు అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. అయితే అంబులెన్స్ ఆపరేటర్.. సుభోదీప్ సేన్ కి ఊహించని షాక్ ఇస్తూ ట్రావెలింగ్ ఛార్జి కింద రూ. 17 వేలు డిమాండ్ చేశాడు. దాంతో చేసేదేమీ లేక డ్రైవర్ అడిగిన మొత్తాన్ని సుభోదీప్ సేన్ చెల్లించాడు.

అయితే, అంబులెన్స్ ఆపరేటర్ దోపిడీపై అనుదీప్ మీడియాను ఆశ్రయించాడు. అలాగే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన అధికారికి ఫిర్యాదు కూడా చేశాడు. కష్టకాలం ఉంటే ఇలాంటి దోపిడీ ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు