ఈ వారం మహామహులు.. సునీల్ గవాస్కర్

శుక్రవారం, 30 నవంబరు 2007 (14:33 IST)
FileFILE
క్రికెట్ ప్రపంచంలో సునీల్ గవాస్కర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆల్ టైమ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన సునీల్... ఇన్నింగ్స్ ఓపెనింగ్‌లో సంపూర్ణ విజయాన్నే సాధించాడు. మహాజిడ్డుగా ముద్ర వేసుకున్న సన్నీ.. క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం అవుట్ చేయడం ప్రత్యర్థి జట్టుకు అసాధ్యమే. ఫ్రంట్, బ్యాక్‌ ఫుట్‌ షాట్లతో ఆలరించే సన్నీ.. బాల్ గమనాన్ని అంచనా వేయడంతో మంచి దిట్ట.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. ఈ రికార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇటీవల బద్ధలు కొట్టిన విషయం తెల్సిందే. గణాంకాల పరంగానే సునీల్‌ గవాస్కర్‌ను ఇతర బ్యాట్స్‌మెన్స్ అధికమించ వచ్చేమోగానీ.. అతని శైలి, నేర్పు, టెక్నిక్‌లలో మాత్రం అది సాధ్యం కాకపోవచ్చు.

ఇకపోతే.. 1971లో పోర్ట్ ఆఫ్ స్పైన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ప్రవేశం చేసిన సునీల్ గవాస్కర్ తన చివరి టెస్టును 1987లో బెంగుళూరులో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టుతో తన టెస్టు కెరీర్‌ను ముగించుకున్నాడు. అలాగే వన్డే రంగ ప్రవేశం లీడ్స్ ఇంగ్లాండ్‌తో 1974 జులై 13వ తేదీన జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేయగా, అదే ఇంగ్లాండ్‌తో 1987 ముంబైలో జరిగిన మ్యాచ్‌తో తన వన్డే కెరీర్‌కు స్వస్తి పలికాడు.

వ్యక్తిగత ప్రొపైల

పూర్తి పేరు.. సునీల్ మనోహర్ గవాస్కర్
పుట్టిన తేది.. 1949 జులై 10.
ప్రస్తుత వయస్సు.. 58 సంవత్సరాల 143 రోజులు.
ప్రధాన జట్లు.. భారత్, ముంబై, సోమర్‌సెట్.
నిక్ నేమ్స్.. సన్నీ.
బ్యాటింగ్ స్టైల్.. రైట్ హ్యాండ్.
బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ్ మీడియం, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్
మొత్తం టెస్టులు.. 125. ఇన్నింగ్స్.. 214,
మొత్తం పరుగులు 10,122.
అత్యధిక స్కోరు.. 236 (నాటౌట్).
సెంచరీలు.. 34, అర్థ శతకాలు.. 45.
వన్డే మ్యాచ్‌లు 108. ఇన్నింగ్స్..102.
మొత్తం పరుగులు.. 3092
అత్యధిక స్కోరు.. (103 నాటౌట్).
మొత్తం సెంచరీలు.. 1, అర్థసెంచరీలు.. 27.

వెబ్దునియా పై చదవండి