అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ఠాగూర్

మంగళవారం, 29 జులై 2025 (08:42 IST)
అమెరికాలో మళ్లీ తూటా పేలింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మాన్‌హట్టన్‌లోని ఓ భవనంలోకి చొరబడిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఎన్.వై.పి.డికి చెందిన పోలీస్ అధికారి సహా నలుగురు మృతి చెందారు మరికొందరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 యేళ్ల షేన్ తమురాగా గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. 
 
సోమవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో మ్యాన్‌హట్టన్‌లోని పార్క్ అవెన్యూ ఆకాశహార్మ్యంలోకి చొరబడిన తమురా... బిల్డింగ్‌లోని 32 అంతస్తు లాబీలో ఎన్.వై.పి.డి పోలీస్ అధికారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత 33వ అంతస్తులోకి వెళ్లిన నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. 
 
నిందితుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించివున్నాడని, ఏఆర్ సైల్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులతో పాటు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనను న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. కాగా, అమెరికాలో ఈ యేడాది ఇప్పటివరకు 254 మాస్ షూటింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు