టీమ్ ఇండియా బుల్లోడు సచిన్ తొలి సెంచరీ కొట్టిన వేళ..!

FILE
యువ క్రికెటర్లకు మార్గదర్శకంగా నిలిచిన టీమ్ ఇండియా బుల్లోడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... యావత్తు క్రికెట్ ప్రపంచానికే అభిమాన పాత్రుడు. అంతర్జాతీయ క్రికెట్‌‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సచిన్ టెండూల్కర్‌ అభిమానులు సెప్టెంబర్ 9వ తేదీని ఎప్పటికీ మరిచిపోరు. ఎందుకంటే..? సచిన్ తన వన్డే క్రికెట్ కెరీర్‌లోనే తొలి సెంచరీని సాధించిన రోజు సెప్టెంబర్ 9, 1994.

భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొన్న క్రికెట్ సిరీస్‌లో భాగంగా కొలంబియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సచిన్ తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 78వన్డేలాడిన ఈ బుల్లోడు ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తొలి సెంచరీని సాధించాడు. అయితే ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ పలు ప్రపంచ రికార్డులను సృష్టిస్తాడని ఎవ్వరికీ తెలియదు. అయితే 79వ వన్డే మ్యాచ్‌లోనే సచిన్ టెండూల్కర్ తొలి సెంచరీని నమోదు చేసుకోవడానికి వీలైంది.

అలాగే 70 వన్డేల్లో ఆడిన తర్వాతే సచిన్ టెండూల్కర్.. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 82 పరుగులు సాధించిన సచిన్, బౌలర్లకు గ్రేట్ మాస్టర్‌గా కనిపించాడు. షార్జాలో జరిగిన మరో వన్డేలో వాసిమ్ అక్రమ్ బౌలింగ్‌లో అద్భుత సిక్సర్ కొట్టి అందరినీ ముక్కుపై చేయ్యేసుకునేట్లు చేశాడు.

దీని తర్వాతే కొలంబోలో సింగర్ సిరీస్ జరిగింది. అప్పటి ఆస్ట్రేలియా జట్టుకు టేలర్ కెప్టెన్. భారత జట్టుకు అజారుద్ధీన్ సారథ్యం వహించాడు. మైక్రా, షేన్ వార్న్, స్టీవ్ వా వంటి పటిష్టమైన బౌలర్లను కలిగివున్న ఆసీస్ జట్టుతో సమరం అంటే ఆషామాషీ కాదు. డే/నైట్ మ్యాచ్‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

మనోజ్ ప్రభాకర్, సచిన్‌లు క్రీజులోకి దిగారు. ప్రభాకర్ 20 పరుగులు సాధించేలోపు సచిన్ టెండూల్కర్ అర్థసెంచరీని దాటేశాడు. అప్పటికే సచిన్‌ను అవుట్ చేయాలనే ఆసీస్ బౌలర్ల సూపర్ బౌలింగ్ ఏమాత్రం పనిచేయలేదు. ఈ క్రమంలో క్రెయిన్ బౌలింగ్‌లో మాస్టర్ సూపర్ సిక్సర్ కొట్టడంలో ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తారు.
FILE


ఇదేవిధంగా మైక్రా విసిరిన బంతుల్లోనూ సచిన్ ఫుల్ షాట్లతో అభిమానులను ఆకట్టున్నాడు. మైక్రా విసిరిన ఆరు ఓవర్లలో సచిన్ 41 పరుగులు సాధించడం విశేషం. సచిన్ తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపింది. 20 ఏళ్ల చిన్న బుల్లోడు ముప్పు తిప్పలు పెడుతున్నాడని ఆసీస్ బౌలర్ మైక్రా కోపంతో ఊగిపోయాడు. ఇదే ఆవేశంతో అంపైర్ వద్ద ఇచ్చిన టోపీని సైతం ఆవేశంతో లాక్కొని వెళ్లాడు.

ఈ క్రమంలో సచిన్‌ను ఆసీస్ బౌలర్లు 119 (8 బౌండరీలు రెండు సిక్సర్లతో) పరుగుల వద్ద అవుట్ చేయగలిగారు. ఈ విధంగా సచిన్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. తర్వాత 110 పరుగుల వద్ద మెక్‌డర్మాట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన సచిన్, జట్టుకు 211/4 పరుగులు సాధించిపెట్టాడు.

ఇదే మ్యాచ్‌లో సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ 47 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. సిధు (24), అజారుద్ధీన్ (31), కపిల్ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ.. సచిన్ (110), కాంబ్లి (43) భాగస్వామ్యంతో టీమ్ ఇండియా 246 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలోనే 215 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో ప్రభాకర్ అద్భుతంగా రాణించాడు. కేవలం 34 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. రాజేష్ చౌకాన్ రెండు వికెట్లు సాధించగా, కపిల్ దేవ్, రాజా, కుంబ్లే తలా ఒక్కో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే వన్డే కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేసుకున్న సచిన్ టెండూల్కర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అటుపిమ్మట జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. మరో మ్యాచ్‌లో శ్రీలంక పాకిస్థాన్, ఆసీస్‌లను ఓడించింది. చివరికి భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా 25 ఓవర్లకే కుదించారు. ఇందులో శ్రీలంక 98 పరుగులు సాధించింది. ఫలితంగా అజారుద్ధీన్ సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

కాగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి సెంచరీ భారత్‌కు కొలంబోలో ట్రోఫీని సంపాదించిపెట్టింది. కాబట్టి సెప్టెంబర్ 9వ తేదీ సచిన్, భారత క్రికెట్, సచిన్ అభిమానులకు మరువలేని రోజుగా మిగిలిపోయింది.

వెబ్దునియా పై చదవండి