ఒకే ఓవర్‌లో 43 పరుగులు సమర్పించుకున్న బౌలర్...

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (13:53 IST)
కౌంటీ చాంపియన్‌‍షిప్ టోర్నీలో భాగంగా, లీసెస్టషైర్, సస్సెక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓలీ రాబిన్సన్ అనే బౌలర్ ఒకే ఓవర్‌లో ఏకంగా 43 పరుగులు సమర్పించుకుని, చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రీజ్‌లోకి ఎనిమిదో ఆటగాడిగా వచ్చిన లూసియ్ కింబర్ 43 పరుగులు పిండుకుని సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
ఈ మ్యాచ్‌లో లూయీస్ కింబర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. సస్సెక్స్ బౌలర్ రాబిన్సన్ 59వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లో కింబర్ సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. పైగా, ఈ ఓవర్‌లోనే బౌలర్ మూడు నోబాల్స్ వేశాడు. మొత్తం రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లు కొట్టాడు. 
 
చివరి బంతికి సింగిల్ తీశాడు. ఈసీబీ డొమెస్టిక్ చాంపియన్‌షిప్‌లో నోబాల్‌కు రెండు పరుగులు అదనంగా ఇస్తారు. అలాగే, మూడు నోబాల్స్‌కు ఆరు పరుగులు వచ్చాయి. ఫలితంగా ఒకే ఓవర్‌లో ఏకంగా 43 పరుగులు వచ్చాయి. కౌంటీ చాంపియన్‌షిప్ 134 యేళ్ల చరిత్రలో ఒక ఓవర్‌లో 43 పరుగులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు