మొహాలీ వన్డే : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ఆదివారం, 10 మార్చి 2019 (13:41 IST)
మొహాలీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో అందరూ ఊహించినట్లుగానే తుదిజట్టులో టీమ్ మేనేజ్‌మెంట్ నాలుగు మార్పులు చేసింది. మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడు, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా స్థానంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్ తుదిజట్టులోకి వచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఆతిథ్య జట్టు విజయం సాధిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఒకవేళ ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఈ నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. 
 
భారత్ జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా. 
 
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్, ఖవాజా, షాన్ మార్ష్, హాండ్స్‌కాంబ్, మాక్స్‌వెల్, టర్నర్, అలెక్స్ కేరీ, రిచర్డ్‌సన్, కమిన్స్, బెహ్న్రెడార్ఫ్, జంపా. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు