ఇంగ్లండ్ జట్టులో టామీ 29 పరుగులు, ఎల్లెన్ జాన్స్ 26 పరుగులు, డానియల్ వ్యాట్ 24 పరుగులు సాధించారు. ఇక భారత మహిళల బౌలర్లలో అంజున పటేల్, హర్లిన్ డియోల్‌లు రెండు చొప్పున, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్‌లు చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
తదనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల పతనానికి 119 పరుగులు సాధించింది. అయినా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. భారత మహిళా జట్టులో స్మృతిమందన 58 పరుగులతో అర్థ సెంచరీ సాధించినా, మిథాలిరాజ్ 30 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.