లెజండరీ వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 సూపర్ స్టార్ క్రిస్ గేల్ 22 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 84 పరగులు సాధించాడు. అబుదాబి టీ10 లీగ్‌లో తన మార్క్ బ్యాటింగ్‌తో రికార్డు నెలకొల్పాడు. యూనివర్స్ బాస్ టీ10 లీగ్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీని నమోదు చేశాడు.