బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు టెస్టులు ముగిశాయి. ఆఖరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగనుంది. దీనికోసం టీమిండియా మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ చేరుకుంది. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలోనే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై మాజీలు పెదవి విరుస్తున్నారు. జట్టుకు అండగా ఉండాల్సిన వీరిద్దరూ భారంగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పడం గమనార్హం.