మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్ టెండూల్కర్ ఏకైక కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. ముంబైకు చెందిన సానియాల చందోక్‌తో అర్జున్‌తో నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియాలో ఓ వైరల్ అవుతోంది. ఈ నిశ్చితార్థం కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్టు సమాచారం. అయితే దీనిపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ముంబై మహానగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలే సానియా చందోక్. రవి ఘాయ్ కుటుంబానికి ఆతిథ్య, ఆహార రంగాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ హోటల్, ప్రముఖ ఐస్క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీ పాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. ఇక సానియా విషయానికి వస్తే ఆమె చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. 'మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ భాగస్వామిగా, డైరెక్టర్‌గా ఉన్నారు.
లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బ్యాటర్ అయిన అర్జున్ భారత జట్టులోకి వచ్చేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. దేశీవాళీ క్రికెట్ గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. 17 ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 37 వికెట్లతో పాటు 532 పరుగులు చేశాడు. 24 టీ20ల్లో 27 వికెట్లు తీసి, 119 పరుగులు చేశాడు. ఇక ఐపీఏల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.