ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ముగ్గురు క్రీడాకారుల పేర్లను హాకీ ఇండియా ప్రతిపాదించింది. క్రీడారంగంలో ప్రతిష్టాత్మక పురస్కారమైన ఈ అవార్డు కోసం భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రీతు రాణి, పురుషుల జట్టులో సీనియర్ ఆటగాడు వీఆర్ రఘునాథ్, ఆసియా క్రీడల్లో పతకం సాధించిన జట్టు సభ్యుడు ధర్మవీర్‌సింగ్‌ను ప్రతిపాదిస్తున్నట్లు హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ మహ్మద్ ముస్తాఖ్ అహ్మద్ వెల్లడించారు.
ఇకపోతే.. మాజీ ఆటగాడు సిల్వనస్ దంగ్ దంగ్‌ను మేజర్ ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారానికి, ప్రముఖ కోచ్ సీఆర్ కుమార్‌ను ద్రోణాచార్య అవార్డుకు హాకీ ఇండియా ప్రతిపాదించింది. 1980లో ఒలింపిక్ బంగారు పతకం సాధించిన భారత జట్టులో మాజీ ఆటగాడు దంగ్ దంగ్ ఒకరు కావడం గమనార్హం.