హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ఠాగూర్

మంగళవారం, 22 జులై 2025 (18:19 IST)
పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్. ఎంఎం కీరవాణి. జ్యోతికృష్ణ దర్శకుడు. ఏఎం రత్నం. నిర్మాత. అయితే, ఈ చిత్రం అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ మంగళవారం నుంచి ఓపెన్ అయ్యాయి. ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో బుక్ మై షో, డిస్ట్రిక్స్ యాప్ వేదికల ద్వార బుకింగ్స్ ప్రారంభంకాగా, ప్రీమియం సీట్లు కొద్దిసేపటికే సోల్డ్ ఔట్ అవుతున్నాయి. ఏపీలో పెయిడ్ ప్రీమియర్‌కు సంబంధించిన షో టికెట్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు.
 
'హరి హర వీరమల్లు' చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. పెయిడ్ ప్రీమియర్ ధరను రూ.600గా నిర్ణయించారు. ఈ షోకు సంబంధించిన ఆంధ్రప్రదేర్ రాష్ట్రంలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఎంపిక చేసిన సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఈ షోను ప్రదర్శిస్తున్నారు. రెక్లయినర్/సోఫా సదుపాయం కలిగిన టికెట్ ధర రూ.1000 దాటగా, బాల్కనీ ధర రూ.830, సెకండ్ క్లాస్ రూ.790 (బుకింగ్ ఛార్జీలు అదనం) లభిస్తున్నాయి. 
 
ఇక జులై 24 నుంచి మల్టీ ప్లెక్స్‌లలో పెంచిన ధరకు అనుగుణంగా రాయల్ సీటింగ్ రూ.495, ఎగ్జిక్యూటివ్ రూ.377 ధర చూపిస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో బాల్కనీ రూ.250, ఫస్ట్ క్లాస్ రూ.150గా నిర్ణయించారు. (వీటికి బుకింగ్ ఛార్జీలు అదనం)
 
ఇక తెలంగాణ రాష్ట్రంలో 'హరి హర వీరమల్లు' టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే, పెయిడ్ ప్రీమియర్‌కు సంబంధించి ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. జులై 24వ తేదీ నుంచి మల్టీ ప్లెక్స్‌లో రాయల్ సీటింగ్ రూ.500, ఎగ్జిక్యూటివ్ రూ.413 (బుకింగ్ ఛార్జీలు అదనం)గా బుక్ మై షోలో చూపిస్తోంది. సింగిల్ స్క్రీనులో బాల్కనీ రూ.300, ఫ్రంట్ సర్కిల్ రూ.200గా నిర్ణయించారు. దీనికి బుకింగ్ ఛార్జీలు అదనం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు