Gali Kiriti Reddy, Junior
గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. గత వారం విడుదలైన ఈ సినిమా కన్నడలో మామూలుగా ఆడుతోంది. తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇందుకు సినిమాలో సరైన కంటెంట్ లేకపోవడంతోపాటు బోరింగ్ సన్నివేశాలతో నిండిపోయింది. అక్క, తమ్ముడు సెంటిమెంట్ కథతో రూపొందిన ఈ చిత్రానికి అంతకు ముందు వారమే వచ్చి నితిన్ తమ్ముడు సినిమా కూడా అలాంటి సెంటిమెంట్ రావడం కూడా మైనస్ అయింది.