బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంది శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కీలక పాత్రల్లో మెప్పించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఓ గ్రామంలోని ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే కథ. గ్రామానికి చెందిన ఆలయ భూములపై ఓ రాజకీయ నాయకుడు కన్నేస్తాడు. అతను వాటి కోసం ఏం చేశాడు. ముగ్గురి స్నేహితుల జీవితాలు ఎలా మలుపు తిరిగాయనేదే భైరవం కథ. స్నేహం, లవ్, ఎమోషన్స్ ప్రధాన అంశాలుగా తెరకెక్కిన ఈ సినిమా వంద మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించటం విశేషం.
ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా పని చేశారు. జూలై 18 జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న భైరవం చిత్రాన్ని తప్పక చూడండి.