ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ నెంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇక పది వికెట్లతో ఐదో టెస్టులో అదరగొట్టిన రవీంద్ర జడేజా నాలుగు ర్యాంకులు ఎగబాకి రెండోస్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరు బౌలర్లు కలిసి ఓ రికార్డు కూడా సృష్టించారు. 1974 తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమిండియా బౌలర్లుగా నిలిచిన ఘనత కెక్కారు.
1974లో ఈ రికార్డు భారత స్పిన్ ద్వయం బిషన్‌సింగ్ బేడీ, భగవత్ చంద్రశేఖర్‌లు నెలకొల్పారు. ఆ రికార్డును అశ్విన్, జడేజా తిరగరాశారు. అలాగే టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకుల్లోనూ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదే లిస్టులో రవీంద్ర జడేజా తన కెరీర్‌లో అత్యుత్తమ మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
ఇక టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 120 పాయింట్లతో భారత్ టాప్‌లో నిలబడగా, ఆస్ట్రేలియా (105)తో రెండో స్థానంలోనూ, పాకిస్థాన్ (102)తో మూడో స్థానంలో నిలిచాయి. టాప్-10లో దక్షిణాఫ్రికా (102), ఇంగ్లండ్ (101), కివీస్ (96), శ్రీలంక (96), వెస్టిండీస్ (69), బంగ్లాదేశ్, జింబాబ్వేలో నిలిచాయి.