స్పైడర్ క్యామ్ కదిలింది.. భయపడిపోయిన బాబర్.. వీడియో వైరల్

సెల్వి

గురువారం, 14 మార్చి 2024 (11:17 IST)
Mohammad Babar Azam
కరాచీ కింగ్స్‌తో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజామ్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌లో పాల్గొన్నాడు. కరాచీ కింగ్స్ ఛేజింగ్ ప్రారంభానికి ముందు బాబర్ ఫీల్డ్‌కి వెళ్తున్నప్పుడు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. 
 
స్పైడర్‌ క్యామ్‌తో బాబర్‌ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అయితే స్పైడర్‌ క్యామ్‌ కదలడంతో భయపడిపోయాడు. అతని రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. 
 
ఇకపోతే.. పెషావర్ జల్మీ 2 పరుగుల తేడాతో కరాచీ కింగ్స్‌ను ఓడించి పీఎస్ఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కెప్టెన్ బాబర్ 46 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టు స్కోరు 147/6కు సహకరించాడు. ఆపై కరాచీ కింగ్స్ 2 పరుగుల తేడాతో 145/5 మాత్రమే చేయగలిగింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు