భారత క్రికెట్ బోర్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను మరోసారి యూఏఈలో నిర్వహించబోతున్నదని ఆయన ప్రకటించారు. ఐపీఎల్‌కు సంబంధించి జైషా ఇప్పటికే యూఏఈ సాంస్కృతిక, యువజన, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి షేక్ నహ్యాన్‌ను కలిసి మాట్లాడారు.
తొలిరోజైన సెప్టెంబరు 19న డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 10న క్వాలిఫయర్ 1, అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అక్టోబరు 13న క్వాలిఫయర్ 2 మ్యాచ్ నిర్వహించనున్నారు.
అక్టోబరు 15న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మేం సెప్టెంబరు 19న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-14వ సీజన్‌ను పునరుద్ధరించనున్నాం. అక్టోబరు 10, 13 తేదీల్లో క్వాలిఫయర్ 1, 2 మ్యాచ్‌లు నిర్వహిస్తాం. అక్టోబరు 11న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలను త్వరలో అన్ని టీమ్‌లకు తెలియజేస్తాం అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.