దుబాయ్ వేదికగా ఆసియా క్రికెట్ కప్ టోర్నీ జరిగింది. ఇందులో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఫలితంగా తొమ్మిదో సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. అయితే, ఈ ఫైనల్ ముగిసిపోయి మూడు రోజులు అయింది. కానీ, ఆ ఫైనల్ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు.
అయితే, ట్రోఫీ ప్రజెంటేషన్‌లో ఓ ఆసక్తిర సంఘటన జరిగింది. ఆసియా క్రికెట్ టోర్నీ చైర్మన్‌గా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ట్రోఫీని విజేత జట్టుకు ఇవ్వకుండా తనవద్దే పెట్టుకున్నారు. అలాగే, మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా చేసిన ప్రకటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఇప్పటికే బీసీసీఐ తన అసంతృప్తిని వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. వారిద్దరిపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది.
అయినా సరే, మొండిపట్టుదలతో నఖ్వీ కండీషన్లు పెట్టాడు. తమకు వెంటనే అప్పగించాలని బీసీసీఐ అధికారులు కోరగా.. వ్యక్తిగతంగా కెప్టెన్ సూర్యకుమార్ తన వద్దకు రావాలని నఖ్వీ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ మాత్రం అంగీకరించకుండా.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏసీసీ ఏజీఎంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా గట్టిగానే ప్రశ్నించారు. తన ఆఫీస్‌కు భారత సారథిని రప్పించి పైచేయి సాధించినట్లు ప్రగల్భాలు పలకడమే నఖ్వీ నక్కజిత్తుల ప్లాన్ అంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.