బీసీసీఐ తదుపరి కార్యదర్శి ఎవరు?

ఠాగూర్

శుక్రవారం, 20 డిశెంబరు 2024 (17:07 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త కార్యదర్శి ఎవరన్నదానిపై ఇపుడు ఆసక్తికర చర్చ సాగుతుంది. వచ్చే యేడాది జనవరి 12వ తేదీన ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజునే కొత్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల నిర్వహణాధికారిగా మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అచల్‌కుమార్‌ జ్యోతిని నియమించారు. 
 
ఈ మేరకు అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారం పంపారు. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా... మహారాష్ట్ర మంత్రిగా ఆశిష్‌ షెలార్‌ బాధ్యతలు స్వీకరించడంతో బోర్డు కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. రాజీనామా చేసిన కార్యవర్గ సభ్యుల స్థానంలో కొత్త వాళ్లను 45 రోజుల్లోపు ఎన్నుకోవాలి. ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల అధికారిని నియమించాలి. 
 
ఈ మేరకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, కార్యదర్శితోపాటు కోశాధికారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం అస్సాంకు చెందిన దేవ్‌జిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్‌తోపాటు దేవ్‌జిత్ సైకియా కార్యదర్శి పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఎన్నికల అధికారిగా నియమితులైన అచల్‌కుమార్‌ జ్యోతి 1975 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్‌ అధికారి (రిటైర్డ్). ఆయన జులై 2017 నుంచి జనవరి 2018 వరకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా పనిచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు