జమిలి ఎన్నికలపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం - ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.