విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీ?

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (12:03 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఆంగ్ల మీడియా కోడైకూస్తోంది. టీ20 ప్రపంచ కప్ అనంతరం అతను వన్డే, టీ20లలో కెప్టెన్సీ వీడనున్నట్టు సమాచారం.

టీ20 ప్రపంచ కప్ తర్వాత తనంతట తాను టీ20, వన్డేలలో కెప్టెన్సీ నుంచి తప్పుకుని హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే యోచనలో కోహ్లి ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కోహ్లి యోచిస్తున్నాడట. దీనిపై బీసీసీఐతో కూడా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
 
ఇప్పటివరకు కోహ్లి 95 వన్డే మ్యాచ్‌లకు సారథ్యం వహించగా 65 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అలాగే 45 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా 29 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అంటే విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్నట్టే. అయితే సారథ్య బాధ్యతలతో అతను బ్యాటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టట్లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.
 
మరో వైపు రోహిత్ కూడా అవసరమైనప్పుడు తన నాయకత్వాన్ని ప్రదర్శించి సత్తా చాటుకున్నాడు. అలాగే ఐపీఎల్ లో ముంబైకు 5 ట్రోఫీలు అందించి తనేంటో నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ కెప్టెన్సీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు