టీమిండియా భారీ విజయం.. 50 ఏళ్ల చరిత్రను తిరగరాసింది..

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (22:21 IST)
Team India
లండన్‌లోని.. ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా భారీ విక్టరీని అందుకుంది. ఈ 4వ టెస్టు విజయంతో… దాదాపు యాభై ఏళ్ళ చరిత్రను తిరగరాసింది కోహ్లీ సేన. ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు పై ఏకంగా 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది భారత జట్టు. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు కకావికలం అయ్యారు.
 
దీంతో తో 210 పరుగులకే… రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలింది ఇంగ్లాండ్ జట్టు. ఉమేష్ యాదవ్ ధాటికి… ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు వరుసగా పెవిలియన్ కు దారి పట్టారు. ఓపెనర్ బర్న్స్ 50 పరుగులు, ఆసీస్ హమీద్ 63 పరుగులు మరియు కెప్టెన్ రూట్ 36 పరుగులు మినహా ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. 
 
దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. యార్కర్లతో ఇంగ్లండ్ ని బెంబేలిత్తించిన బుమ్రా 2 వికెట్లు తీశాడు. ఉమేష్ కి 2, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో హమీద్ (63) ఒక్కడే రాణించాడు. ఈ విజయంతో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. 5వ టెస్టు గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా ఈ సిరీస్ భారత్‌దే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు