కాగా, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పదేళ్ల తర్వాత బీజీ ట్రోపీని ఆస్ట్రేలియాకు అప్పగించి, పరాయజ భారంతో స్వదేశానికి తిరిగిరానుంది.
ఆ తర్వాత స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి టీ20 సిరీస్, వచ్చే నెల ఆరో తేదీ నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.
ఈ క్రమంలో కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, అర్షదీప్ సింగ్‌లకు చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. ఇక, ఇంగ్లండ్‌తో సిరీసు స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలిసింది. నాలుగు నెలల వ్యవధిలో అతడు ఏకంగా 10 టెస్టులు ఆడటం, ఇటీవల ముగిసిన మెల్బోర్న్ టెస్టులో 53.2 ఓవర్లు బౌలింగ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అంతేకాదు, ఆసీస్ పర్యటనలో బుమ్రా మొత్తం 151.2 ఓవర్లు వేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రా అందుబాటులో లేకున్నా, చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడని చెబుతున్నారు. అంతేకాదు, చాంపియన్స్ ట్రోఫీలో అతడు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి.