ధోనీ ఐపీఎల్ క్రికెట్ కెరీర్‌పై సీఎస్కే స్పష్టత - అప్పటివరకు అతనే కెప్టెన్?!

బుధవారం, 12 ఆగస్టు 2020 (18:27 IST)
జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (ఎస్ఎస్ ధోనీ) ఐపీఎల్ క్రికెట్ కెరీర్‌పై ఐపీఎల్ ప్రాంఛైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ యేడాది యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ పోటీల్లోనే కాకుండా, ఆ తర్వాత 2021, 2022 సంవత్సరాల్లో జరిగే ఐపీఎల్ పోటీల్లో కూడా ధోనీ భాగమవుతాడని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని చెన్నై జట్టు సీఈఓ కాశి విశ్వనాథన్ వెల్లడించారు. 
 
గత యేడాది ప్రపంచ కప్ సెమీఫైనల్ నుంచి ఇప్పటివరకు ధోనీ ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం 2020తో పాటు.. త్రం 2021, 2022 ఎడిషన్‌లలో కూడా సీఎస్‌కే ఫ్రాంచైజీలో భాగమవుతాడని పేర్కొంది. 39 యేళ్ల ధోనీ.. ఈ ఏడాది యూఏఈలో జరుగబోయే ఐపీఎల్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ పోటీలు వచ్చే సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్‌ జరుగనున్నాయి. 
 
'ఎంఎస్ ధోని ఐపీఎల్‌ 2020, 2021 రెండింటిలో భాగమని మేము ఆశిస్తున్నాం. బహుశా తర్వాతి సంవత్సరం 2022 వరకు కూడా ఆయన జట్టులో ఉండవచ్చు'' అని విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు. 'ధోని ప్రస్తుతం ఇండోర్‌ నెట్స్‌లో శిక్షణ పొందుతున్నాడని మీడియా ద్వారా తెలిసింది. కానీ మేము మా బాస్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జట్టు బాధ్యతల గురించి అతడికి తెలుసు. జట్టును అతను చూసుకుంటాడు' అని విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు