క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పోటీలు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. మహారాష్ట్రంలోని ముంబై, పూణె స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే, ఈ పోటీల ప్రారంభానికి ముందు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
ఐపీఎల్ పోటీలను అక్రమంగా 8 వెబ్ సైట్లు అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తున్నాయని, అందువల్ల వాటిని తక్షణం బ్లాక్ చేయాలంటూ కేంద్ర సమాచార, సాంకేతిక శాఖు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిషేధం విధించిన వెబ్‌సైట్లలో లైవ్.ఫిక్స్‌హబ్.నెట్, స్టిస్‌స్పోర్ట్స్.కామ్, వీఐపీలీగ్.ఐఎం, మ్యాక్స్‌స్పోర్ట్.వన్, గూయల్.టాప్, టీ20డబ్ల్యూసీ.ఎన్ఎల్, వీఐపీస్టాండ్.సె, స్ట్రీమ్.బిటోలట్.ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఉన్నాయి.