ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఈసారి బయోపిక్‌ల పడ్డాడు. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదంటూ గౌతం గంభీర్ అన్నాడు. క్రికెటర్ల కంటే దేశం కోసం త్యాగాలు చేసిన వారు, గొప్ప పనులు చేసిన వారు ఎందరో ఉన్నారని గంభీర్ వెల్లడించాడు. వారిపై సినిమాలు తీయాల్సిందిపోయి.. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదని గంభీర్ వెల్లడించారు.
గతంలో టీమిండియాకు అనిల్ కుంబ్లేని కోచ్‌గా ఎంపిక చేసి తప్పు చేశారంటూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలకు క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో నీకన్నా పెద్ద పిచ్చోడు ఉండడు అంటూ రవిని ఉద్దేశించి గంగూలీ కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ రవిశాస్త్రిపై మాటల తూటాలు పేల్చాడు. ‘‘అసలు 18 నెలల పాటు జట్టు డైరెక్టర్ గా ఉండి ఏం సాధించారో చెప్పండి’’ అంటూ రవిని నిలదీసిన సంగతి తెలిసిందే.