ఐపీఎల్ పండగ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై చేరుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా చెన్నైకి చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ కోసం ఓ అభిమాని పెద్ద సాహసమే చేశాడు. మైదానంలో పరుగు తీస్తున్న ధోనీతో షేక్ హ్యాండ్ కోసం సాహసోపేతంగా స్టేడియంలోని బారికేడ్లని దాటి మైదానంలోకి పరుగెత్తాడు.