బీసీసీఐ కీలక నిర్ణయం.. రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు

మంగళవారం, 6 డిశెంబరు 2022 (21:48 IST)
Female Umpires
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు అంపైర్లుగా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు కనిపించనున్నారు. 
 
రాబోయే రోజుల్లో మహిళా అంపైర్ల సంఖ్యను మరింత పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది.  భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్‌లో సైతం మహిళా అంపైర్లు కనిపిస్తారని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ప్రస్తుతం గాయత్రి, జనని, వృందారతి అనే మహిళా అంపైర్లు సిద్ధంగా వున్నారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు