దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ కన్నుమూత

సోమవారం, 23 అక్టోబరు 2023 (23:02 IST)
Bishan Singh Bedi
టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ (77) సోమవారం తుది శ్వాస విడిచారు. భారత స్పిన్ బౌలింగ్ విప్లవానికి బాటలు వేసినవారిలో బిషన్ సింగ్ ఒకరు. 
 
స్లో లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌‌గా 1966 నుంచి 1979 వరకు భారత్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తన 15వ ఏట నార్త్రన్‌ పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశవాళీ క్రికెట్‌‌లో అడుగుపెట్టాడు. 
 
వన్డేల్లో భారత్ సాధించిన మొట్టమొదటి విజయంలో ఎరపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్.వెంకటరాఘవన్‌లతోపాటు బిషన్ సింగ్ బేడీ కీలక పాత్ర పోషించారు. 
 
1946 సెప్టెంబర్‌ 25న జన్మించిన బిషన్‌ సింగ్‌ బేడీ 67 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 266 వికెట్లు తీసుకున్నాడు. 22 టెస్ట్‌ మ్యాచ్‌లకు జట్టుకు కెప్టెన్సీ వహించాడు. 
 
1970లో కేంద్ర ప్రభుత్వం, పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి బిషన్‌ సింగ్‌ బేడీని గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డు అందుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు