భారత మాజీ స్టార్ ప్లేయర్ హర్భజన్ సింగ్ పేరిట నకిలీ ట్విట్టర్ అకౌంట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అకౌంట్ వివాదాన్ని కొనితెచ్చిపెట్టింది. టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో వున్నాడు. రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ వన్డే, ట్వంటీ-20 ఫార్మాట్‌లలో అదరగొట్టే రోహిత్ శర్మకు సంప్రదాయ టెస్టు జట్టులో మాత్రం స్థానం ఖరారు కాలేదు.
గత ఏడాది పాటు టెస్టు క్రికెట్ జట్టులో స్థానం కోసం రోహిత్ శర్మ పోరాటం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు క్రికెట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ 11 క్రికెటర్లతో కూడిన టీమిండియా జట్టులో రోహిత్ శర్మ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడా అనేది ఇంకా ఖరారు కాలేదు. రోహిత్ శర్మకు టెస్టు జట్టులో స్థానం దక్కకపోవడానికి కెప్టెన్ కోహ్లీనే కారణమని కూడా చర్చ సాగుతోంది.
ట్విట్టర్లో తాను ఎలాంటి ట్వీట్ చేయలేదని, రోహిత్ శర్మ గురించి తాను చేసినట్లు వచ్చిన ట్విట్టర్ అకౌంట్ నకిలీదని భజ్జీ తేల్చేశాడు. ఇలాంటి గాలి వార్తలను పక్కనబెట్టి.. అందరం కలిసి టీమిండియాకు మద్దతు పలుకుదామని భజ్జీ వెల్లడించాడు.