ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 35 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ క్రికెట్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఆర్‌సిబి మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న 16 ఏళ్ల రికార్డును కూడా పాండ్యా బద్దలు కొట్టాడు.