ఇంగ్లండ్‌లో ఇరగదీస్తున్న శుభ్‌మన్ గిల్.. గవాస్కర్, కోహ్లీ రికార్డులు బ్రేక్.. సిరాజ్ అదుర్స్

సెల్వి

శనివారం, 5 జులై 2025 (20:05 IST)
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఇరగదీస్తున్నాడు. ఒకే టెస్టులో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే డబుల్ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న గిల్.. తాజా మ్యాచ్‌లో వంద బంతుల్లో 80 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో ఒకే టెస్టులో అత్యధిక పరుగులు అంటే 346 పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. 
 
అంతకుముందు ఈ రికార్డు సునీల్ గవాస్కర్ (344, వెస్టిండీస్‌పై) ఉండేది. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఓ రికార్డు అందుకున్నాడు.  విరాట్ కోహ్లీ (449 పరుగులు, 4 ఇన్నింగ్స్‌లు)ని అధిగమించి కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన భారత సారథిగా గిల్ (459*, 4 ఇన్నింగ్స్‌లు) ఘనత సాధించాడు. అంతేగాకుండా భారత టెస్టు కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించి క్రికెట్ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. 
 
మరోవైపు ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఎదురీదుతోంది ఇంగ్లండ్. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయింది ఇంగ్లండ్. బ్రూక్, స్మిత్ రాణించినా టాపార్డర్‌తో పాటు మిడిల్, లోయరార్డర్‌లో పలువురు బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 400 ప్లస్ స్కోరు చేసిన జట్టులో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగానే మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండి తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. మొత్తం 587 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు దిగిన ఇంగ్లాండ్‌ జట్టు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 
Mohammed Siraj
 
కానీ టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ దాటికి తట్టుకోలేకపోయారు. సిరాజ్ తన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 19.3 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేయడం ద్వారా సిరాజ్ తన కెరీర్‌లో మరో ఫీట్ సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో 5 వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా అతడు నిలిచాడు. 1993 తర్వాత పర్యాటక జట్టు నుంచి వచ్చిన ఒక బౌలర్ ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో 6 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటి సారి.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు