శుభమన్ గిల్‌కే టెస్ట్ పగ్గాలు : వీసీగా రిషబ్ పంత్

ఠాగూర్

శనివారం, 24 మే 2025 (15:36 IST)
ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత టెస్ట్ క్రికెట్ జట్టు పగ్గాలను యువ క్రికెటర్ శుభమన్ గిల్‌కు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌‍ను నియమించారు. అందరూ ఊహించినట్టుగానే గిల్‌కు కెప్టెన్సీని అప్పగించింది. ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టీమిండియాను బీసీసీఐ శనివారం అధికారికంగా వెల్లడించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 20వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ఆడనుంది. 
 
కాగా, సాయి సుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఈ సిరీస్‌తో టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి సుధీర్ఘ ఫార్మెట్‌లోకి అడుగుపెడుతున్నారు. చివరిసారిగా అతడు 2017 మార్చిలో టెస్ట్ మ్యాచ్ ఆడారు. టెస్ట్ ఫార్మెట్‌కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత  ఇపుడు మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుంటే, ఇంగ్లండ్ పర్యటన కోసం ప్రకటించిన వివరాలను పరిశీలిస్తే, 
 
శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాగూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు