చాంపియన్స్ ట్రోఫీ : భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఆడే పిచ్ రిపోర్టు ఏంటి?

ఠాగూర్

ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (13:07 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దాయాది జట్టు పాకిస్థాన్‌కు చావోరేవోగా మారింది. మరోవైపు, ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సెమీస్‌‍లో చోటును ఖరారు చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్ళూరుతుంది. 
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు మ్యాచ్‌లు ఆడింది. వీటిలో ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్‌లో ఇప్పటివరకు మొత్తం 59 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 22 మ్యాచ్‌లు మాత్రమే నెగ్గింది. ఒకటి ఫలితం తేలలేదు. మరొకటి టైగా ముగిసింది. 
 
ఇదిలావుంటే, ఈ మైదానం బౌలర్లకు కొంత అనుకూలంగా ఉంటుంది. 59 మ్యాచ్‌లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. చివరిసారి పాకిస్థాన్ జట్టు 2019లో 300కు పైగా స్కోరు చేసింది. 
 
ఇక ఈ పిచ్ మీద తొలి మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు పరుగులు చేసేందుకు నానా అవస్థలు పడ్డారు. 228 పరుగుల ఛేజింగ్ కోసం భారత్ 47 ఓవర్లు ఆడాల్సివచ్చింది. ముఖ్యంగా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు కొంత వెసులుబాటు లభిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌‍ బ్యాటర్ల సగటు 25 శాతం కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 29 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో టాస్ అత్యంత కీలకంకానుంది. 
 
మరోవైపు, ఈ వేదిక స్పిన్నర్ల కంటే సీమర్లకే ఎక్కువగా సహకరిస్తుందని గత రికార్డులు వెల్లడిస్తున్నాయి. 59 మ్యాచ్‌లలో పేసర్లు 28 సగటు, 4.79 ఎకానమీతో 473 వికెట్లు తీశారు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే 30 సగటు, 4.25 ఎకానమీతో 325 వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్‌లో పేసర్లే 10 వికెట్లు నేలకూల్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు