అయితే కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రభావం క్రికెట్‌పైనా పడింది. అప్పుడప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఆడటమే తప్ప రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇండోపాక్ క్రికెట్ అభిమానులకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ యేడాది ఆఖరులో భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 సిరీస్ జరగనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ చారిత్రక సిరీస్ కోసం సిద్ధంగా ఉండాలని తమకు ఆదేశాలు వచ్చినట్లు ఆయన చెప్పడం గమనార్హం.
చివరిసారి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగినప్పుడు పాకిస్థాన్ టీమ్ ఇండియాకు వచ్చింది. చివరిసారి ఈ రెండు దేశాల మధ్య 2012-13లో జరిగింది. అయితే, ఇటు బీసీసీఐ, అటు పీసీబీ అధికారుల మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు.