దాయాదుల క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. చివరి సారిగా 2012-13లో పాక్ వేదికగా రెండు జట్లు మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరిగింది. ఆ తర్వాత 2008లో ఆసియా కప్ కోసం భారత్ పాక్‌లో పర్యటించింది. చివరగా ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం పాక్ ప్రభుత్వం సన్మహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు జట్లు మధ్య సిరీస్‌లు జరగడం అగిపోయింది. దేశాల మధ్య పర్యటనలు కూడా అగిపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్‌లో మాత్రమే ఈ రెండు జట్ల బరిలోకి దిగుతున్నాయి.