రిషబ్ పంత్‌కు ఐసోలేషన్ పూర్తి.. మరోమారు కోవిడ్ పరీక్షలు

మంగళవారం, 20 జులై 2021 (12:07 IST)
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా వైరస్ సోకడంతో ఐసోలేషన్‌లో ఉండగా, ఈ కాలపరిమితి ముగిసింది. అయితే, ఆయనకు మరోమారు కోవిడ్ పరీక్షలు చేయనున్నారు. 
 
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచ వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ పోటీ తర్వాత మూడు వారాలు బ్రేక్ దొరికింది. ఆ తర్వాత బయో బ‌బుల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పంత్‌కు ఈ నెల 8వ తేదీన క‌రోనా వైరస్ సోకింది. 
 
నిబంధనల ప్రకారం 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నప్పటికి పంత్ కి కరోనా పరీక్షల్లో నెగటివ్ తేలాల్సి ఉంది. ఆయనకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పంత్‌కు నెగటివ్‌గా తేలితే అప్పుడు టీమ్‌తో పాటు బయోబబుల్‌లో చేరతాడు. 
 
ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్న పంత్ త్వరలోనే జట్టులో చేరే అవకాశం ఉంది. అయితే, ప్రాక్టీస్ మ్యాచ్ సమయానికి పంత్ ఐసోలేషన్ పూర్తిచేసుకున్నప్పటికీ అతడి మరింత విశ్రాంతి అవసరమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు