కోహ్లీ దూకుడులో అమర్యాద లక్షణమా? ఎక్కడండి బాబూ.. వివ్ రిచర్డ్స్

శనివారం, 22 డిశెంబరు 2018 (17:58 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పెర్త్ టెస్టులో ప్రత్యర్థి కెప్టెన్‌తో కోహ్లీ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలొస్తున్న తరుణంలో.. కోహ్లీకి ఆసీస్ క్రికెటర్ల మద్దతు లభించింది. ఇప్పటికే కోహ్లీ దూకుడంటే తనకు చాలా ఇష్టమని ఆసీస్ దిగ్గజం డెన్నీస్ లీల్లి వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం మరో విండీస్ స్టార్ వివ్ రిచర్డ్స్ కోహ్లీకి అండగా నిలిచాడు. భారత జట్టు 80టీస్ నాటి జట్టు కాదన్నాడు. 
 
విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్ వుండబట్టే టీమిండియాకు కలిసొస్తుందని.. మైదానంలో కోహ్లీ దూకుడును చూసి తానెంతో ముచ్చటపడ్డానన్నాడు. ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే వ్యక్తికి అలాంటి లక్షణం వుండాలని రిచర్డ్స్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. లేనట్లైతే పోటీ తత్వం తగ్గిపోతుందని చెప్పుకొచ్చాడు. అతని దూకుడులో తనకు అమర్యాద లక్షణం కనబడలేదని.. కోహ్లీలో కష్టపడే తత్వం ఎక్కువని కితాబిచ్చాడు. 
 
కోహ్లీ సారథ్యం కారణంగానే భారత జట్టు ప్రపంచ క్రికెట్‌లో ఉన్నత స్థానాన్ని సంపాదించుకోగలిగిందని తెలిపాడు. ప్రస్తుత ఆసీస్ సిరీస్‌లో విజయావకాశాలు ఎక్కువని వ్యాఖ్యానించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు