భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేలలో భారత్ విజయం సాధించింది. మరోవైవు ఈ సిరీస్‌లో మూడో వన్డే మ్యాచ్ ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరుగనుంది. ఇక్కడ కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 404 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ ఒక్కడే 264 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 153 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ప్రస్తుత జట్లలోని ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉండటం, 50 ఓవర్ల క్రికెట్లో పలు మార్పులు జరగడంతో బౌలర్లపై మరోసారి ప్రతికూల ప్రభావం అవకాశం ఉంది.
అందులోనూ ఈడెన్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో అభిమానులు పరిమిత ఓవర్ల మజాను పొందే చాన్స్ ఉంది. ఇప్పటివరకూ ఈ స్టేడియంలో భారత్ 20 వన్డేలు ఆడగా, అందులో 11 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఈ వేదికపై భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ రెండు వన్డేలు జరగగా, ఆ రెండింటిలోనూ భారత జట్టే విజేతగా నిలిచింది.