భారత క్రికెట్ జట్టు అక్టోబరు నెల 19వ తేదీ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనతో భాగంగా ఇరు జట్లూ మూడు వన్డేలు, ఐదు టీ 20ల్లో తలపడనున్నాయి. ఇందుకోసం ఎనిమిది వేదికల్లో ఇండియన్ ఫ్యాన్ జోన్స్ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. దీనికితోడు సిడ్నీ, కాన్‌బెర్రాలో పబ్లిక్ టికెట్లు కూడా హాట్ కేకుల్లా పూర్తిగా అమ్ముడైనట్టు పేర్కొంది.
ఇంకా 50 రోజుల సమయం ఉండగానే ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరగబోయే మూడు వన్డేలు, అయిదు టీ20లకు సంబంధించి ఇండియన్ ఫ్యాన్ జోన్స్ టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. అభిమానుల నుంచి వచ్చిన ఈ విశేష స్పందనకు మేం ఆనందం వ్యక్తం చేస్తున్నాం అని క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ ఈవెంట్స్.. జోయెల్ మోరిసన్ పేర్కొన్నారు.
ఇండో-ఆసీస్ క్రికెట్ షెడ్యూల్ ఇదే...
అక్టోబరు 19 - మొదటి వన్డే - పెర్త్ స్టేడియం, పెర్త్
అక్టోబరు 23 - రెండో వన్డే - అడిలైడ్ ఓవల్, అడిలైడ్
అక్టోబరు 25 - మూడో వన్డే - ఎస్‌సీజీ, సిడ్నీ
టీ20 మ్యాచ్‌లు..
అక్టోబరు 29 - మొదటి టీ 20 - మనుకా ఓవల్, కాన్ బెర్రా
అక్టోబరు 31 - రెండో టీ 20 - ఎంసీజీ, మెల్‌బోర్న్
నవంబరు 2 - మూడో టీ 20 - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్
నవంబరు 6 - నాలుగో టీ 20 - గోల్డ్ కోస్ట్ స్టేడియం, గోల్డ్ కోస్ట్