జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ - 40 మంది స్టార్ క్యాంపైనర్లు

ఠాగూర్

ఆదివారం, 19 అక్టోబరు 2025 (09:10 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, విపక్ష పార్టీలైన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ మాత్రం జూబ్లీహిల్స్‌లో జెండా ఎగురవేయాలన్న గట్టి పట్టుదలతో ఉంది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఏకంగా 40 మందిని స్టార్ క్యాంపైనర్లుగా నియమించింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ నటి విజయశాంతితో పాటు దానం నాగేందర్ కూడా ఉన్నారు. ఈ స్థానానికి నవంబరు 11వ తేదీన ఉప ఎన్నిక ఓటింగ్ జరుగనుంది. 
 
కాంగ్రెస్ విడుదల చేసిన స్టార్ క్యాంపైనర్ల జాబితాలో మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, విశ్వనాథన్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, వంశీచంద్ రెడ్డి, కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీహరి ముదిరాజ్, రేణుకా చౌదరి, సంపత్ కుమార్, హన్మంత రావు, అజారుద్దీన్, జనారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, విజయశాంతి, అంజన్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, జెట్టి కుసుమ్ కుమార్, దానం నగేందర్, రాములు నాయక్, సునీతా ముదిరాజ్ తదితరులు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు