ఆస్ట్రేలియాలో కరోనా విజృంభిస్తోంది. సిడ్నీలో ఆ టెన్షన్ మరీ ఎక్కువగా ఉంది. అయితే భారత్‌తో జరగాల్సిన మూడవ టెస్టుకు వేదిక అయిన సిడ్నీలో మ్యాచ్ జరుగుతుందో లేదో అనుమానంగా ఉంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ వేదికనే స్టాండ్‌బైగా కన్ఫర్మ్ చేశారు. ఎంసీజీ మైదానంలో మూడవ టెస్ట్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా పేర్కొంది.
వాస్తవానికి జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ టెస్టు జరగాల్సి ఉంది. కానీ ఆ టెస్టును మెల్‌బోర్న్‌లో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కూడా మెల్‌బోర్న్‌లో జరగనుంది.
డిసెంబర్ 26వ తేదీ నుంచి రెండవ టెస్టు ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం న్యూ సౌత్ వెల్స్‌లో రికార్డు స్థాయిలో కరోనా టెస్టింగ్ జరుగుతోందని, కేసులు అదుపులోనే ఉన్నాయని, కానీ ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే, అప్పుడు మూడవ టెస్టు కోసం ప్రత్యామ్నాయ వేదిక సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్లే తెలిపారు.