ఇంగ్లండ్‌పై ప్రతీకారం : విజయానికి అడుగు దూరంలో భారత్

బుధవారం, 22 ఆగస్టు 2018 (13:25 IST)
తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఓటమిపాలైన భారత్.. మూడో టెస్టులో మాత్రం ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయానికి అడుగు దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో హార్డిక్‌ పాండ్యా ఆతిథ్య జట్టు నడ్డి విరవగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆ బాధ్యతను బుమ్రా తన భుజానికెత్తుకున్నాడు. 521 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఇంగ్లండ్‌, గంట తిరిగే సరికే నాలుగు వికెట్లు కోల్పోయింది. కుక్‌, రూట్‌లాంటి ప్రధాన బ్యాట్స్‌మన్‌లు ఔటైపోవడంతో తొలి రెండు సెషన్లలోపే ఆట ముగిసిపోతుందనుకున్నారు.
 
కానీ, బట్లర్‌, స్టోక్స్‌ జోడీ భారత్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. దాదాపు నాలుగున్నర గంటలపాటు భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఆపై బుమ్రా మ్యాజిక్ కొనసాగింది. టపటపా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను పతనం అంచుకు చేర్చాడు. దీంతో నాలుగో రోజే భారత్‌ విజయంతో ఆట ముగిస్తుందని అభిమానులు ఆశించినా, 9 వికెట్లు మాత్రమే పడ్డాయి. విజయానికి భారత్ ఒక వికెట్‌ దూరంలో నిలిచింది.
 
సంక్షిప్తంగా స్కోర్లు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌-329
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌-161
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌-352/7
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌-311/9

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు