అది కూడా 31 ఏళ్ల రికార్డును అశ్విన్ సవరించాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అశ్విన్ 25కు పైగా వికెట్లను, 250కి పైగా పరుగులను సాధించాడు. ఇలా ఒక సిరీస్‌లో 25 వికెట్లు, 250 పరుగులు సాధించడం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.
ఇప్పటివరకు ఈ తరహా రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బోథమ్ పేరుమీద ఉంది. 1985లో ఈ ఘనతను సాధించగా, ఆ తర్వాత అశ్వినే మొదటి ఆటగాడు. యాషెస్ సిరీస్‌లో బోథమ్ 31 వికెట్లతో పాటు సుమారు 250 పరుగులను సాధించాడు. కాగా, ఈ సిరీస్‌లో అశ్విన్ ఇప్పటివరకూ 28 వికెట్లు తీయగా, 306 పరుగులను సాధించాడు.
కాగా, గత 40 ఏళ్లకు పైగా కాలం నుంచి చూస్తే ఐదు టెస్టుల సిరీస్ లో 26కు పైగా వికెట్లు, 294కు పైగా పరుగులు సాధించడం కూడా ఇదే తొలిసారి. 1966-67 సీజన్ లో చివరిసారి దక్షిణాఫ్రికా ఆటగాడు ట్రెవర్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ట్రెవర్ ఈ మార్కును చివరిసారి సాధించాడు.