తెలంగాణ, జనగాం జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలం పిట్టలోని గూడెం గ్రామంలో సోమవారం రాత్రి ఒక వ్యక్తిని అతని ఇద్దరు భార్యలు నరికి చంపేసిన ఘటన కలకలం రేపింది. గతంలో జరిగిన హత్యకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగింది.
సోమవారం రాత్రి, కనకయ్య గ్రామానికి తిరిగి వచ్చాడని, ఆ హత్యపై అతనికి, అతని ఇద్దరు భార్యల మధ్య గొడవలు జరిగాయని.. దీంతో ఆవేశానికి గురైన ఇద్దరు మహిళలు కనకయ్యను బండరాళ్లు, గొడ్డలితో నరికి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. వారు అతని మృతదేహాన్ని గ్రామం వెలుపల పారవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.