కోహ్లీకి చేదు అనుభవం.. రూ. 12 లక్షల జరిమానా.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (16:10 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2020)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన బెంగళూరు.. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ చేతిలో ఘోర ఓటమిని ముటగట్టుకుంది. అదే కాదు ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లికి భారీ జరిమానా పడింది.
 
బౌలింగ్ పూర్తి చేయడానికి కేటాయించిన టైమ్‌ కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఐపీఎల్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లికి జరిమానా విధించినట్టు తెలిపింది. ఇక, ఈ మ్యాచ్ అన్నిరకాలుగా కోహ్లీకి చేదు అనుభవాన్నే మిగిల్చిందనే చెప్పాలి.
 
పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. కోహ్లి రెండు క్యాచ్‌లను జారవిడిచాడు. ఆ సమయంలో రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ 83 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒకసారి.. 89 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరోసారి కోహ్లి క్యాచ్‌లను డ్రాప్ చేశాడు. దీనికి బెంగళూరు జట్టు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ 69 బంతుల్లోనే 132 పరుగులు సాధించడంతో పంజాబ్.. 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు