ఈ వేలం పాటల్లోభాగంగా, ఆస్ట్రేలియాకు చెందిన పాట్‌కమ్మిన్స్‌ను కోల్‌కతా జట్టు రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. అలాగే, మ్యాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)ను రూ10.75 కోట్లకు పంజాబ్, క్రిస్ మెరిస్‌ను(దక్షిణాఫ్రికా) రూ.10 కోట్లకు బెంగళూరు, ఇయాన్ మోర్గాన్‌ను( ఇంగ్లాండ్) రూ.5.25 కోట్లకు కోల్‌కతాకు దక్కించుకున్నాయి.
అలాగే, ఆరోన్ ఫించ్‌ను(ఆస్ట్రేలియా) రూ.4.40 కోట్లకు బెంగళూరు, రాబిన్ ఊతప్ప(భారత్) రూ.3 కోట్లకు రాజస్థాన్, క్రిస్‌లిన్‌ను(ఆస్ట్రేలియా) రూ.2 కోట్లకు ముంబై, జాసన్‌రాయ్‌ను(ఇంగ్లాండ్) రూ.1.50 కోట్లకు ఢిల్లీ జట్లు దక్కించుకున్నాయి. మిగిలిన ఆటగాళ్ళ వేలం పాటలు ఇంకా కొనసాగుతున్నాయి.