"సెక్స్ ఫర్ సెలెక్షన్"... అమ్మాయిని పంపిస్తే క్రికెట్ జట్టులో చోటు!

గురువారం, 19 జులై 2018 (16:53 IST)
భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లపై యూపీకి చెందిన యువ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశారు. సీనియర్ జట్టు చోటు దక్కాలంటే స్టార్ హోటల్‌కు అమ్మాయిని పంపించాల్సిందేనని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ రాజీవ్ శుక్లా సహాయకుడు మొహమ్మద్ అక్రమ్ సైఫీ తనతో చెప్పాడని యువ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపణలు చేశాడు. అక్రమ్- ఉత్తరప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ఓ హిందీ న్యూస్ చానల్ బయటపెట్టింది. ఇది సెలక్షన్ కమిటీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
ఇదే అంశంపై రాహుల్ శర్మ మాట్లాడుతూ తాను ‘సెక్స్ ఫర్ సెలక్షన్’ బాధితుడినని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల వయసుకు సంబంధించి అక్రమ్ నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి ఇచ్చేవాడని, ఆ తర్వాత వారికి వివిధ ఏజ్-గ్రూప్ టోర్నీల్లో చోటు కల్పించేవాడని రాహుల్ ఆరోపించాడు. జట్టులో స్థానం కోసం అక్రం డబ్బులు వసూలు చేసేవాడని మరికొందరు ఆరోపించారు.
 
అయితే, రాహుల్ శర్మ ఆరోపణలను సైఫీ కొట్టి పడేశారు. కొందరు ఆటగాళ్లు తనను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేయడానికి 'శర్మ అండ్ కో' మూడేళ్లు ఎందుకు ఆగారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, అక్రమ్ ఆరోపణలకు సంబంధించి షోను ప్రసారం చేసిన టీవీ రికార్డు చేసిన సంభాషణ ఎప్పుడు జరిగిందీ వెల్లడించకపోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు