మహారాష్ట్రలో ఓ వింత ఆచారం ఉంది. అదీ కూడా ఆ తెగకు చెందిన యువతులకు ఈ అగ్నిపరీక్ష నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నవ వధువులకు తొలి రాత్రి కన్యత్వ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో యోని ద్వారా రక్తంకారితే కన్య అని, రక్తపు మరక కనిపించకపోతే అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని తేల్చేస్తారు. మహారాష్ట్రలోని కంజర్‌భట్ కులంలో ఈ ఆచారం ఉంది.
ఈ కులాచారం ప్రకారం.. మొదటిరాత్రి కన్యత్వ పరీక్ష చేస్తారు. కొత్త జంటకు ఓ వైట్ షీట్ ఇచ్చి.. ఓ ఇంట్లోకి పంపి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు బయట ఎదురుచూస్తారు. సంభోగంలో అమ్మాయికి బ్లీడింగ్ అయితే ఆమె కన్య. లేకపోతే కాదు. మర్నాడు ఉదయం పెళ్లికొడుకును రక్తపు మరక గురించి అడుగుతారు. అతను ఉందని చెబితే ఆ అమ్మాయి పవిత్రురాలు! లేదని చెబితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.