దివ్యాంగులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ క్రికెట్ సంఘం

ఠాగూర్

గురువారం, 27 మార్చి 2025 (13:43 IST)
దేశంలో సంపన్న క్రీడగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ పోటీలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని భావించే దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ పాస్‌లను జారీ చేస్తామని ప్రకటించింది. 
 
ఈ టిక్కెట్లు కావాల్సిన వారు పేరు, కాంటాక్ట్ నంబర్, వ్యాలిడీ డిజబులిటీ ప్రూఫ్ సర్టిఫికేట్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలి వంటి పూర్తి వివరాలతో [email protected] అనే మెయిల్‌కు పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. సీట్లు పరిమితంగా ఉంటాయి కనుకు మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటికి మాత్రమే ప్రాధాన్యత ఆధారంగా పాస్‌‍లు మంజూరు చేస్తామని తెలిపింది. 
 
కాగా, మరోవైపు, గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో లక్నో సూపర్ జైంట్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు